
తల్లిదండ్రులు మందలించారని బాలిక ఆత్మహత్య
గుంతకల్లు: తరుచూ సెల్‌ఫోన్ చూస్తుండటం, మాట్లాడుతుండటంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. గుంతకల్లు తిలక్‌నగర్‌లోని వేద ఆస్పత్రి వెనుక వీధిలో నివాసముంటున్న మోహన్, లక్ష్మీ దంపతులకు ఇద్దరు సంతానం. మోహన్ స్థానిక వాసవీ పైప్స్ కంపెనీలో పని చేస్తున్నాడు. ఆయన కుమార్తె శృతి (18) పట్టణంలోని శస్త్ర కళాశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ బైపీసీ చదువుతుంది. కొన్ని రోజులుగా శృతి తరచూ సెల్‌ఫోన్‌లో ఎక్కువగా మాట్లాడుతుండటంతో తల్లిదండ్రులు మందలించేవారు. ఆదివారం ఉదయం కూడా ఫోన్‌లో మాట్లాడుతున్న ఆమెను మందలించారు. అనంతరం భార్యాభర్తలిరువురు మార్కెట్‌కు వెళ్లారు. శృతి తమ్ముడు తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్లాడు.ఈ నేపథ్యంలోనే శృతి బెడ్‌రూమ్‌లోకి వెళ్లి ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. మార్కెట్ నుంచి ఇంటికి చేరుకున్న మోహన్, లక్ష్మీలు బిడ్డ ఉరికి వేలాడుతుండడం చూసి కేకలు వేయడంతో ఇరుగుపొరుగు వారు వచ్చి శృతిని కిందికి దింపారు. ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. టూటౌన్ సీఐ ఏపీ మస్తాన్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
టీచర్ల జీతాల చెల్లింపులో నిర్లక్ష్యం తగదు: వైఎస్సార్‌టీఏ
అనంతపురం ఎడ్యుకేషన్:బదిలీ అయిన వేలాదిమంది టీచర్లకు రెండు నెలలవుతున్నా జీతాల చెల్లింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం తగదని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ (వైఎస్సార్‌టీఏ) నాయకులు వాపోయారు. ఈ మేరకు అసోసియేషన్ అనంతపురం జిల్లా అధ్యక్షుడు ఎస్.నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి జి.శ్రీధర్‌గౌడ్ ఆదివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకూ కేడర్‌స్ట్రెన్త్ అప్‌డేట్ చేయకుండా అధికారులు తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారన్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని జీతాల మంజూరుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.