
కూటమి ప్రభుత్వంలో అన్నదాతలను కష్టాలు నీడలా వెన్నంటే ఉంట
అనంతపురం అర్బన్: రైతులకు చుక్కుల భూముల తిప్పలను తొలగించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ‘ఫైళ్లు బారెడు... పరిష్కారం మూరెడు’ అన్నట్లుగా చుక్కల భూముల ఫైళ్ల పరిష్కార ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. ప్రతి శుక్రవారం చుక్కల భూముల ఫైళ్లను పరిష్కరిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నా.. ఆ సంఖ్య నాలుగైదుకు మించి ఉండడం లేదు. మరో వైపు చుక్కల భూములకు సంబంధించి 1,950కు పైగా ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. చుక్కల జాబితా నుంచి తమ భూములకు విముక్తి ఎప్పుడు కల్పిస్తారోనని రైతులు ఎదురు చూస్తున్నారు.
మొక్కుబడి తంతు..
చుక్కల భూములకు సంబంధించి అత్యధికంగా అనంతపురం డివిజన్‌లో బుక్కరాయసముద్రం, అనంతపురం రూరల్, శింగనమల మండలాలతో పాటు కళ్యాణదుర్గం డివిజన్‌లో కంబదూరు, కళ్యాణదుర్గం, బెళుగుప్ప మండలాల్లో సమస్యలు ఉన్నట్లు అధికారిక సమాచారం వెల్లడిస్తోంది. చుక్కలు భూములకు సంబంధించి 1,953 ఫైళ్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిసింది. గత ప్రభుత్వంలో ప్రతి రెండు, మూడు నెలలకు ఒకసారి డీఎల్‌సీ సమావేశం నిర్వహించి ఒక్కసారిగా 150 నుంచి 200 వరకు ఫైళ్లకు పరిష్కారం చూపినట్లు రెవెన్యూ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతం చుక్కల భూముల ఫైళ్ల పరిష్కార ప్రక్రియ మొక్కుబడి తంతుగా సాగుతోందనే విమర్శలు ఇటు రెవెన్యూవర్గాలు, అటు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి.
ఆమోద ముద్రకు నిబంధనలిలా...
చుక్కల భూముల జాబితాలో ఉన్న ప్రభుత్వ భూమిని సాగు చేస్తున్న వారికి నిబంధనల ప్రకారం డీఎల్‌సీ ఆమోద ముద్ర తప్పనిసరి. ఆమోదం పొందేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలు విధించింది.
● సాగు చేస్తున్నట్లుగా పేర్కొన్న ప్రభుత్వ భూమి వివరాలు ఆర్‌ఎస్‌ఆర్‌లో చుక్కలుగా ఉండాలి. ఆ భూమి ఎవరి పేరునా అసైన్ చేసి ఉండకూడదు.
● డాటెడ్ ల్యాండ్ చట్టం–2017 ప్రకారం... ప్రభుత్వ భూమిని సాగు చేసుకుంటున్న వ్యక్తి.. చట్టం వచ్చిన 12 ఏళ్లకు ముందే ఆ భూమిపై సాగు హక్కు, అనుభవం కలిగి ఉండాలి.
● చట్టం నిబంధనల ప్రకారం సాగు చేస్తున్న వారు తహసీల్దారు వద్ద దరఖాస్తు చేసుకోవాలి. దీనిపై సమగ్ర విచారణ అనంతరం ఆర్‌డీఓకు తహసీల్దారు నివేదిస్తారు. దీని ఆధారంగా ఆర్‌డీఓ విచారణ చేసి కలెక్టర్ కార్యాలయానికి సిఫారసు చేస్తారు.
● ఆర్డీఓ సిఫారసులను కలెక్టర్ కార్యాలయంలో జిల్లాస్థాయి కమిటీ విచారణ చేసి నిబంధనల ప్రకారం అన్ని సక్రమంగా ఉన్నవాటిని జాబితా నుంచి తొలగిస్తూ అమోద ముద్ర వేస్తారు.
పెండింగ్ ఫైళ్లు ఇలా... అనంతపురం డివిజన్ 1,183 కళ్యాణదుర్గం డివిజన్ 763 గుంతకల్లు డివిజన్ 7 మొత్తం 1,953
మొక్కుబడిగా చుక్కల భూముల
ఫైళ్ల పరిష్కారం
డీఎల్‌సీలో నాలుగైదుకు మించి
పరిష్కారం కాని వైనం
పెండింగ్‌లో 1,950కు పైగా ఫైళ్లు
విముక్తి కోసం రైతుల ఎదురు చూపు