
●కళకళలాడుతున్న తుంగభద్రమ్మ
బొమ్మనహాళ్: తుంగభద్ర జలాశయం కళకళలాడుతోంది. డ్యాంలోకి వరద నీటి చేరిక కొనసాగుతోంది. ఈ క్రమంలో డ్యాం 14 క్రస్ట్ గేట్ల 4 అడుగులు, 12 క్రస్ట్ గేట్లు 3 అడుగుల మేర పైకెత్తి 98,235 క్యూసెక్కులు నదికి, 13,583 వేల క్యూసెక్కులు వివిధ కాలువలకు మొత్తంగా 1,11,818 క్యూసెక్కుల నీటిని బయటికి వదులుతున్నారు. తుంగభద్రమ్మ కళకళలాడుతుండటంతో జిల్లాలోని ఆయకట్టు రైతులు ఆనందంలో మునిగిపోయారు. సకాలంలో పంటలను సాగు చేసుకునేందుకు ఉత్సాహంగా నాట్లు వేసుకుంటున్నారు. ప్రసుత్తం టీబీ జలాశయంలో 1,633 అడుగుల నీటి నిల్వ గాను 1,624.62 అడుగులకు నీరు చేరుకుంది. ఇన్‌ఫ్లో 82,874 క్యూసెక్కులు కాగా అవుట్‌ఫ్లో 1,11,818 క్యూసెక్కులుగా నమోదవుతోంది. మొత్తం నీటి సామర్థ్యం 105.788 టీఎంసీలు కాగా 75.260 టీఎంసీల నీరు నిల్వ ఉంది.