ట్రాక్టర్‌ బోల్తా .. దంపతుల దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

ట్రాక్టర్‌ బోల్తా .. దంపతుల దుర్మరణం

Jul 3 2023 7:30 AM | Updated on Jul 3 2023 7:30 AM

- - Sakshi

అనంతపురం: మండల పరిధిలోని నక్కలపల్లి వద్ద ట్రాక్టర్‌ బోల్తా పడటంతో పొలం పనులకు వెళ్తున్న రైతు దంపతులు ఈశ్వర్‌రెడ్డి (46), సువర్ణమ్మ (38) అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. నక్కలపల్లికి చెందిన ఈశ్వర్‌రెడ్డి, సువర్ణమ్మ దంపతులు ఆదివారం ట్రాక్టర్‌కు గుంటకను అమర్చుకొని పొలం పనులకు బయలు దేరారు. గ్రామ సమీపంలో ఎర్ర వంక పక్కనే ఉన్న రహదారిపై ట్రాక్టర్‌ అదుపుతప్పి వంకలోకి దూసుకెళ్లి బోల్తాపడింది.

ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మృతులకు కుమారుడు పునీత్‌రెడ్డి, కుమార్తె సుమనశ్రీ ఉన్నారు. వారు 6, 8 తరగతి చదువుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారి మృతితో నక్కలపల్లిలో విషాదచా యలు అలముకున్నాయి. మృతుని తల్లి తిప్పమ్మ ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రామకృష్ణయ్య తెలిపారు.

మాజీ ఎమ్మెల్యే విశ్వ సంతాపం..
రైతు దంపతుల మృతి విషయం తెలియగానే మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి చేరుకొని ఈశ్వర్‌రెడ్డి, సువర్ణమ్మ మృతదేహాల వద్ద నివాళులర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట బీసీసెల్‌ జిల్లా అధ్యక్షులు సీపీ వీరన్న తదితరులున్నారు. ఎమ్మెల్సీ వై శివరామిరెడ్డి కూడా బాధిత కుటుంబానికి ఒక ప్రకటనలో ప్రగాఢ సానుభూతి తెలిపారు. అధైర్య పడొద్దు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement