
నకిలీ మద్యాంధ్రప్రదేశ్‌గా మార్చారు
అనంతపురం: నకిలీ మద్యం తయారీని ఒక పరిశ్రమలా మార్చి, కూటమి పెద్దల కనుసన్నల్లో రాష్ట్రమంతా పారించి అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ అన్నారు. నకిలీ మద్యం కేసులో సీబీఐ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతపురంలోని వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని రంగాలు కల్తీమయం అయ్యాయన్నారు. కల్తీ మద్యం వ్యవహారంలో ఫేక్ వీడియో సృష్టించి, పక్షపాత దర్యాప్తు చేసినట్లు స్పష్టమవుతోందన్నారు. చంద్రబాబు తప్పుడు వార్తలు రాయిస్తూ, దొంగ డిబేట్లు పెట్టిస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. మద్యమే కాకుండా.. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు.. ఇలా అన్నీ కల్తీ చేస్తున్నారని, చివరకు చంద్రబాబు, ఆయన పార్టీ కూడా కల్తీనే అని విమర్శించారు. ఎకై ్సజ్ శాఖ నుంచి వచ్చే ఆదాయం నాలుగు అణాలు ఖజానాకు వెళితే.. 12 అణాలు చంద్రబాబు జేబులోకి వెళ్తోందనే విషయాన్ని మరవకూడదన్నారు. ప్రతి పల్లెలో నాలుగైదు బెల్టుషాపులు ఉన్నాయని, చంద్రబాబు ఆధ్వర్యంలోనే నకిలీ మద్యం తయారీ ప్లాంట్లు ఏర్పాటయ్యాయని ఆరోపించారు. ఇందులో తయారైన మద్యం అన్ని షాపుల్లోకి చేరిందన్నారు. ప్రతి మూడు మద్యం బాటిళ్లలో ఒకటి నకిలీ బాటిలే అన్నారు. నకిలీ మద్యం మకిలిని వైఎస్సార్‌సీపీకి అంటగట్టే ప్రయత్నం చేయడం దారుణమన్నారు.
పోలీసు ఆఫీసర్లే వీడియో రికార్డు చేయించారు
‘నకిలీ మద్యం వ్యవహారంలో పోలీసు వ్యవస్థ ఒక వ్యక్తిని అరెస్ట్ చేసింది. వెంటనే అతని వద్ద ఉన్న వస్తువులన్నింటినీ స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తారు. కానీ స్వయంగా పోలీసు ఆఫీసర్లే అతనితో వీడియో రికార్డు చేయించారు. అది కూటమి ప్రభుత్వానికి అనుకూలంగా ఉండేలా అతనితో మాజీ మంత్రి జోగి రమేష్‌పై ఆరోపణలు చేయించారు. ఇది చాలా దుర్మార్గం’ అని గోరంట్ల మాధవ్ అన్నారు. ప్రభుత్వం పోలీసుల పట్ల ఎలా వ్యవహరిస్తోందో అందరూ గమనించాలన్నారు. ఇప్పటికే ఐపీఎస్ అధికారులు అరెస్ట్ అయ్యారని, మరికొందరు సస్పెండ్ అయ్యారని, ఇంకొంత మంది రాష్ట్రం వదలి వెళ్లిపోయారని గుర్తు చేశారు. ఇప్పటికై నా ఐపీఎస్ అధికారులు కళ్లు తెరవాలన్నారు. చంద్రబాబు ఉచ్చులో పడొద్దన్నారు. చంద్రబాబు అక్రమంగా సంపాదిస్తూ వ్యవస్థలను మేనేజ్ చేస్తున్నారని, ఈ అంశాన్ని బీజేపీ, పవన్‌కల్యాణ్ గుర్తించాలన్నారు. కర్నూలు పర్యటనకు వస్తున్న ప్రధాని మోదీ ఈ విషయాలన్నింటినీ గమనించాలన్నారు. చంద్రబాబు దోపిడీపై పవన్‌కళ్యాణ్, బీజేపీ నేతలు ప్రధానికి ఫిర్యాదు చేయాలన్నారు.
ప్రతి మూడింటిలో
ఒక బాటిల్ నకిలీ మద్యమే
పోలీసులను అడ్డుపెట్టుకుని చంద్రబాబు అక్రమ కేసులు పెట్టిస్తున్నారు
సీబీఐ విచారణ జరపాలి
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ డిమాండ్