
..ఇలా జిల్లా వ్యాప్తంగా ఎందరో అర్హులైన దివ్యాంగులు తమ ప
రాప్తాడురూరల్: అనంతపురం రూరల్ మండలం పాపంపేటకు చెందిన తాడాల నాగభూషణం నాలుగు చక్రాల వాహనాల మెకానిక్‌గా పని చేస్తున్నాడు. గతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తలకు గాయమైంది. దీన్ని ఆసరాగా చేసుకుని మానసిక వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ పొందాడు. అప్పట్లో వైద్యులపై ఒత్తిడి చేయించి ఈ సర్టిఫికెట్ పొందాడనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. అప్పటి నుంచి దాదాపు పదేళ్లుగా దివ్యాంగుల కోటాలో పింఛన్ పొందుతున్నాడు. తొలుత నెలకు రూ.1,500 వచ్చేది. ఆ తర్వాత రూ.3 వేలు, ఇప్పుడు రూ.6 వేలు వస్తోంది.
మానసిక రోగి...ఇంత యాక్టివ్ ఎలా?
ఈయన మానసిక రోగిగా ఉంటూ ఇంత యాక్టివ్‌గా ఎలా ఉంటున్నాడనేది ప్రశ్న. అంతేకాదు రాప్తాడు ఆటోనగర్ ప్రెసిడెంట్‌గానూ పని చేశాడు. ప్రస్తుతం గౌరవాధ్యక్షుడిగా ఉన్నాడు. తెలుగుదేశం పార్టీ అనుబంధంగా ఉన్న టీఎన్‌టీయూసీ పార్లమెంటు అధ్యక్షుడిగా కొనసాగుతున్నాడు. నాగభూషణం అక్రమంగా పొందుతున్న పింఛన్‌పై గతంలోనూ పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. అధికారులు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. వందశాతం వైకల్యం కల్గిన అసలైన బాధితుల నోట్లో మట్టి కొట్టేందుకు సిద్ధమైన కూటమి సర్కారు.. తాడాల నాగభూషణం వంటి వారి విషయంలో మాత్రం చూసీచూడనట్లు వ్యవహరిస్తోంది.
ఇదిగో ఈ ఫొటో బాగా పరిశీలించండి. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఇటీవల రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన ‘ఆటోడ్రైవర్ సేవలో’ కార్యక్రమం ప్రారంభించిన సందర్భంలో తీసిన ఫొటో ఇది. ఎమ్మెల్యే పక్కన ఉన్న వ్యక్తి (సర్కిల్‌లో) టీఎన్‌టీయూసీ (తెలుగునాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్) హిందూపురం పార్లమెంట్ అధ్యక్షుడు తాడాల నాగభూషణం. ఈయన మానసిక వ్యాధితో బాధపడుతున్నాడట! దివ్యాంగ కోటాలో (పింఛన్ ఐడీ 112723626) ప్రతినెలా రూ.6 వేల పింఛను తీసుకుంటున్నాడు. ఇటీవల జిల్లాలో దివ్యాంగ పింఛన్లు పొందుతున్న వారిలో 9,601 మందికి ప్రభుత్వం నోటీసులు ఇచ్చింది. వారందరూ మరోమారు వైద్యుల వద్ద వెరిఫికేషన్ చేయించుకోవాలని ఆదేశించింది. వీరిలో చాలామంది తీవ్ర వైకల్యంతో బాధపడుతున్నవారే. ఈ జాబితాలో టీఎన్‌టీయూసీ నేత తాడాల నాగభూషణం పేరు మాత్రం లేదు.

..ఇలా జిల్లా వ్యాప్తంగా ఎందరో అర్హులైన దివ్యాంగులు తమ ప