నేడు స్టీల్‌ప్లాంట్ క్యాప్టివ్ పోర్టుకు
నక్కపల్లి: మండలంలో ఏర్పాటు కానున్న ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్‌ప్లాంట్ వారు నిర్మించే క్యాప్టివ్ పోర్టుకు గురువారం ప్రజాభిప్రాయసేకరణ జరగనుంది. డీఎల్‌పురం వద్ద దీనికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. మండలంలో అమలాపురం, డీఎల్‌పురం, పాటిమీద, మూలపర, చందనాడ, వేంపాడు గ్రామాల పరిధిలో ఆర్సిలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్‌ప్లాంట్‌కు ప్రభుత్వం 2200 ఎకరాలు భూమిని ఏపీఐఐసీ ద్వారా కేటాయించింది. అయితే ప్లాంట్‌కు ముడిసరుకు, ఉత్పత్తులు రవాణా కొరకు పోర్టు అవసరం కానున్న దృష్ట్యా డీఎల్‌పురం సమీపంలో పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. డీఎల్‌పురం రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్లు 82, 85, 235, 202 నెంబర్లలో సుమారు 182.31 హెక్టార్ల పరిధిలో 2.9 కిలోమీటర్ల వాటర్ ఫ్రంట్ కేటాయింపులతో గ్రీన్‌ఫీల్డ్ క్యాప్టివ్ పోర్టు ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేసింది. రూ.8174.39 కోట్ల వ్యయంతో ఈ పోర్టును నిర్మించనున్నారు. ఈ పోర్టు నిర్మాణానికి సంబంధించి పర్యావరణ అనుమతుల కోసం ఏపీ కాలుష్యనియంత్రణ మండలి ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహిస్తున్నారు. బుధవారం ఉదయం ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరగనుంది. పోర్టు నిర్మించే ప్రాంతంలో డీ ఫారం రైతులకు సాగుదార్లకు ఇంకా నష్టపరిహారం చెల్లించాల్సి ఉందంటూ పలు రైతు సంఘాల వారు ఆందోళన చేస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరకుండా పోలీసు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.


