డీఈవో నాగేశ్వరరావు
మునగపాక: పదో తరగతిలో ప్రణాళికతో చదువుకుంటే ఉజ్వల భవిష్యత్ సొంతమవుతుందని డీఈవో నాగేశ్వరరావు పేర్కొన్నారు. క్రమశిక్షణతో చదువుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చన్నారు. మునగపాక జిల్లా పరిషత్ హైస్కూల్‌ను మంగళవారం ఆయన సందర్శించారు. ముందుగా ఉపాధ్యాయులతో సమావేశమైన ఆయన చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. మధ్యాహ్న భోజన పథకం రుచికరంగా ఉండేలా చూడాలన్నారు. అనంతరం పదోతరగతి విద్యార్థుల పుస్తకాలు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇష్టపడి, కష్టపడి చదువుకుంటే పదిలో రాణించవచ్చన్నారు. చదువులో ఏకాగ్రత అవసరమన్నారు. ఇష్టపడి, కష్టపడి చదువుకుంటే ఉన్నత స్థానాలను అధిరోహించవచ్చన్నారు. కార్యక్రమంలో ఎంఈవోలు వేణుగోపాలరావు, శివనాయుడు, హైస్కూల్ హెచ్‌ఎం శ్రీనివాసరావుతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


