కె.కోటపాడు: గొండుపాలెంలో ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటు కోసం ప్రభుత్వం చేపడుతున్న బలవంతపు భూసేకరణ ఆపాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వులను ఇచ్చినట్టు సీపీఎం జిల్లా కార్యదర్శి డి.వెంకన్న తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను మంగళవారం ఆయన విలేకరులకు చూపించారు. ఈ నెల 10న జస్టిస్ సుబ్బారెడ్డి ఉత్తర్వులు ఇచ్చినట్టు తెలిపారు. 2013 భూసేకరణ చట్టానికి లోబడి పబ్లిక్ హియరింగ్ లేకుండా ఈ ఏడాది మే 25న ఎంఎస్‌ఎంఈ పార్కు కోసం భూమిపూజను చేసినట్టు హైకోర్టుకు పిటిషనర్లు హైకోర్టును ఆశ్రయించారని తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలలో తెలిపిన సర్వే నెంబర్లులో చట్ట ప్రకారం ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా వారిని ఖాళీ చేయించడం తగదని పేర్కొన్నారు.


