122 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి | - | Sakshi
Sakshi News home page

122 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలి

Jul 30 2026 1:27 AM | Updated on Jul 30 2026 1:27 AM

ఎస్‌.రాయవరం: తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా రాష్ట్రంలోని 122 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎం.అప్పలరాజు డిమాండ్‌ చేశారు. బుధ వారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఖరీఫ్‌ ప్రారంభం నుంచి వర్షాలు కురవకపోవడంతో రైతులు ఆకాశం వైపు చూస్తున్నారన్నారు. ప్రభుత్వాలు ఉచిత పంటల బీమా పథకం అమలు చేయాలని, పశువుల కోసం పశుగ్రాసం కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అదనంగా ఉపాధి హామీ పనుల కల్పించాలని కోరారు. రైతులను తక్షణమే ఆదుకుని, చేయూత అందివ్వాలన్నారు.

రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి అప్పలరాజు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement