గొలుగొండ: మండలంలోని చోద్యం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న దివ్యాంగ విద్యార్థి నందిక అభిషేక్‌కు జిల్లా సమగ్ర శిక్షఅభి యాన్ కో–ఆర్డినేటర్ రామకృష్ణ ఆధ్వర్యంలో మూడు చక్రాల సైకిల్‌ను బుధవారం అందజేశారు. దివ్యాంగ విద్యార్థి ఎదుర్కొంటున్న ఇబ్బందిపై రెండు రోజుల కిందట ‘కలెక్టర్‌గారు మీరైనా స్పందించండి’ అనే శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి రెవెన్యూ, విద్యాశాఖ అధికారులు స్పందించి, మంగళవారం వివరాలు సేకరించి జిల్లా అధికారులకు పంపిన విషయం తెలిసిందే. డీఈవో గిడ్డి అప్పారా వు నాయుడు ఆదేశాల మేరకు ఆ విద్యార్థికి మూడు చక్రాల సైకిల్‌ను అందజేశారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ హెచ్‌ఎం శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ సుర్ల బాబ్జి, వైస్సార్‌సీపీ గ్రామ పార్టీ అధ్యక్షడు సత్యనారాయణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


