స్వయం భూ విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న శ్రీకాకుళం జిల్లా జడ్జి భారతి | - | Sakshi
Sakshi News home page

స్వయం భూ విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న శ్రీకాకుళం జిల్లా జడ్జి భారతి

Jul 29 2026 1:34 AM | Updated on Jul 29 2026 1:34 AM

చోడవరం: స్థానిక స్వయంభూ విఘ్నేశ్వరస్వామివారిని శ్రీకాకుళం జిల్లా జడ్జి ఎన్‌.ప్రసన్న భారతి మంగళవారం దర్శించుకున్నారు. చోడవరానికి చెందిన ఈమె ఇటీవల శ్రీకాకుళం జిల్లా కోర్టులో జడ్డిగా నియమితులయ్యారు. విఘ్నేశ్వరస్వామివారిని దర్శించుకోడానికి ఇక్కడకు వచ్చిన ఆమెకు చోడవరం బార్‌ అసోసియేషన్‌ న్యాయవాదులు, ఫోరం ఫర్‌ బెటర్‌ చోడవరం ప్రతినిధులు సాదరంగా స్వాగతం పలికారు. ‘గ్రేట్‌ వర్డ్స్‌ ఆఫ్‌ వరల్డ్‌ రెనౌండ్‌ ఇంటెలెక్చువల్స్‌’ పుస్తకాన్ని ఆర్క్‌ సంస్థ ప్రతినిధి ప్రసాద్‌ ఆవిష్కరించి, న్యాయమూర్తి ప్రసన్నభారతికి అందజేశారు. అనంతరం స్వయంభూ విఘ్నేశ్వరస్వామి ఆలయ ప్రధాన అర్చకుడు కొండమంచిలి చలపతిరావు ఆధ్వర్యంలో వేదపండితులు ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో బార్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి చీపురపల్లి సూర్యనారాయణ, శ్రీనివాస్‌, రాజు, ఫోరం ఫర్‌ బెటర్‌ చోడవరం ప్రతినిధులు అప్పారావు, బి.వి. కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement