● సర్వేను అడ్డుకున్న రైతులు
పెద్దపల్లి వద్ద సర్వేను అడ్డుకున్న రైతులు
మునగపాక (యలమంచిలి రూరల్) : తమకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా సర్వే ఎలా చేస్తారంటూ యలమంచిలి పరిధిలోని పెదపల్లి రైతులు అధికారులను అడ్డుకున్నారు. పెదపల్లి వ్యవసాయ భూముల మీదుగా రహదారి నిర్మించే క్రమంలో ఎవరికీ ఎటువంటి సమాచారం ఇవ్వకుండా చేపడుతున్న చర్యలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సర్వే పనులను అడ్డగించారు. భూములు ఎందుకు తీసుకుంటున్నారు? అలాగే మాకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా సర్వే ఎలా నిర్వహిస్తారంటూ పలువురు రైతులు అధికారులపై మండిపడ్డారు. పచ్చని పొలాల మీదుగా రహదారి ఏర్పాటు చేస్తే తమ బతుకులు ఎలా అంటూ రైతులు నిలదీశారు. అలాగే రైతులకు ఎంత మేర పరిహారం ఇస్తారో చెప్పకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడాన్ని రైతులు తప్పుపట్టారు. గ్రామంలో గ్రామసభ నిర్వహించి తీర్మానం చేసిన తరువాతే భూ సర్వే చేయాలని రైతులు డిమాండ్ చేశారు.


