గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన శిలా ఫలకాలు
నక్కపల్లి: ఇటీవల బోయపాడులో జెట్టీనిర్మాణానికి సంబంధించి మంత్రులు శంకుస్థాపన చేసిన శిలాఫలకాలను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. మంత్రులు వంగలపూడి అనిత, బీసీ జనార్ధనరెడ్డి బోయపాడులో జెట్టీకి శంకుస్థాపన చేశారు. రెండు శిలాఫలకాలు ఏర్పాటు చేశారు. వీటిని ఎవరో ధ్వంసం చేశారు. సోమవారం శిలాఫలకాలు ధ్వంసం అయిన విషయాన్ని స్థానిక మత్స్యకారులు గుర్తించారు. రెండురోజుల క్రితమే వీటిని ధ్వంసం చేసినట్టు భావిస్తున్నారు. ఈ విషయమై టీడీపీకి చెందిన మత్స్యకారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.


