జగన్నాథుడి హుండీ ఆదాయం రూ.18 లక్షలు | - | Sakshi
Sakshi News home page

జగన్నాథుడి హుండీ ఆదాయం రూ.18 లక్షలు

Jul 28 2026 1:30 AM | Updated on Jul 28 2026 1:30 AM

హుండీ ఆదాయం లెక్కిస్తున్న ఆలయ అర్చకులు

అనకాపల్లి : గవరపాలెం అగ్గిమర్రిచెట్టు వద్ద సుభద్రా బలభద్ర సమేత జగన్నాథ్‌ స్వామివారి రథయాత్ర మహోత్సవాలు గురింపు కార్యక్రమంలో భాగంగా స్వామివారి హుండీ లెక్కింపు కార్యక్రమం సోమవారం జరిగింది. రథయాత్ర పురస్కరించుకుని స్వామివారి హుండీ ఆదాయం రూ.18,44,366 వచ్చిందని ఆలయ ఈవో కె.చంద్రతేజ చెప్పారు. గత ఏడాది కంటే ఈ ఏడాది రూ.3,07,999 అధికంగా ఆదాయం భక్తుల ద్వారా వచ్చిందన్నారు. నగదును దేవదాయ ధర్మదాయ శాఖ ఖాతాలో జమచేయడం జరిగిందన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్‌ దాడి బుజ్జి, మరో ఆలయ ఈవో మురళి, అర్చకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement