స్థానికేతరులతో మీటింగ్‌ పెట్టుకున్నారు.. | - | Sakshi
Sakshi News home page

స్థానికేతరులతో మీటింగ్‌ పెట్టుకున్నారు..

Jul 28 2026 1:30 AM | Updated on Jul 28 2026 1:30 AM

మేము నలుగురు అన్నదమ్ములం. మా అన్నయ్యకు ఎకరం, నాతో పాటు మిగతా ముగ్గురికి 65 సెంట్లు భూమి చొప్పున ఉంది. జిరాయితీ భూమిలో వరి పంట ఉంది. కొండపై ఉన్న అరెకరంలో పోడు వ్యవసాయం చేస్తాను. మైనింగ్‌ అనుమతిలిచ్చిన కొండకు ఆనుకుని 30 అడుగుల దూరంలోనే నా భూమి ఉంది. బయట నుంచి కొందరినీ తీసుకొచ్చి మీటింగ్‌లా పెట్టుకుని .. దాన్నే ప్రజాభిప్రాయ సేకరణ అంటూ అనుమతి ఇచ్చుకున్నారు. స్థానిక గ్రామస్తులను గానీ, సమీప రైతులకు గానీ సమాచారం ఇవ్వలేదు. దీనిపై మాకు న్యాయం చేయాలని స్థానిక ఎమ్మార్వోకు, మైనింగ్‌ ఏడీకి ఫిర్యాదు చేశాం.

– సింగపల్లి రమేష్‌, రైతు, పి.కొత్తపల్లి గ్రామం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement