రోడ్డు మధ్యలో గ్యాప్ లేకుండా డివైడర్లు ఏర్పాటు చేయడం వల్ల రాకపోకలకు ఇబ్బంది అవుతుంది. రెండు కిలోమీటర్లు వెళ్లి యూటర్న్ తీసుకుని రావాలంటే కష్టం. రైతులు కోరిన విధంగా ప్రతి 200 మీటర్లకు ఒక యూటర్న్ పాయింట్ ఏర్పాటుచేయాలి. రైతుల రాకపోకలకు అవకాశం కల్పించాలి. దీనిపై ఆర్‌అండ్‌బీ అఽధికారులకు వినతి పత్రం ఇచ్చాం.
– దేవవరపు శివ,రైతు కాగిత
ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం
కాగిత సమీపం నుంచి స్టీల్‌ప్లాంట్ అవసరాల కోసం నిర్మిస్తున్న రోడ్డులో ప్రతి 200 మీటర్లకు ఒకచోట పొలాల్లోకి రాకపోకల కోసం యూటర్న్‌లు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. నిబంధనల ప్రకారం ప్రస్తుతం రోడ్డు నిర్మాణం, డివైడర్ల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. రైతుల వినతిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారినుంచి ఆదేశాలు వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం.
– లలిత, ఈఈ ఆర్‌అండ్‌బి


