అనకాపల్లి: స్థానిక శారదానది బ్రిడ్జి వద్ద తిరుమల ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొని సుమారు 60 నుంచి 65 సంవత్సరాల మధ్య వయసు గల గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందినట్టు దువ్వాడ పోలీస్ స్టేషన్ జీఆర్పీ ఎస్‌ఐ కె.టి.ఆర్.లక్ష్మి ఆదివారం చెప్పారు. కశింకోట నుంచి అనకాపల్లి వచ్చే డౌన్ రైల్వే ట్రాక్ పక్కన ఉన్న మృతదేహాన్ని గమనించి, అటుగా వెళుతున్న వ్యక్తులు సమాచారం ఇచ్చారని తెలిపారు. తెలుపు రంగు ఫుల్‌హ్యాండ్స్ చొక్కా, కాఫీ రంగు షార్ట్ ధరించి ఉన్నాడని, ఎడమ ముంజేతిపై లక్ష్మి అనే పచ్చబొట్టు ఉందని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి అనకాపల్లి ఎన్టీఆర్ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసిదర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. వివరాలకు సెల్ నంబర్ 7382058996ను సంప్రదించవచ్చని ఎస్‌ఐ చెప్పారు.


