శిష్టకరణాల అభ్యున్నతికి కృషి | - | Sakshi
Sakshi News home page

శిష్టకరణాల అభ్యున్నతికి కృషి

Jul 27 2026 1:00 AM | Updated on Jul 27 2026 1:00 AM

అనకాపల్లి: శిష్టకరణాల అభ్యున్నతికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు రాష్ట్ర శిష్టకరణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కు మహంతి రాజా చెప్పారు. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ రహదారి వివేకానంద ఫంక్షన్‌న హాల్‌లో ఆదివారం జరిగిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. ఇటీవల మరణించిన సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బద్రి మహంతి వెంకటరావు తదితరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేకమంది సంఘ సభ్యులకు సీఎం సహాయనిధి నుంచి వైద్య సహాయం, నగదు సహాయాన్ని అందజేసినట్లు చెప్పారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి మానాపురం సీహెచ్‌ఎస్‌ గౌరీశంకరరావు మాట్లాడుతూ శిష్టకరణాలు అందరూ ఐక్యంగా ఉండాలన్నారు. మహిళా కన్వీనర్‌ సంజుక్త పట్నాయక్‌ మాట్లాడుతూ శిష్టకరణ మహిళలు అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు. కోశాధికారి బెహరా రాధాకుమారి ఆర్థిక నివేదికను సమర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవాధ్యక్షుడు డబ్బీరు సత్యప్రసాద్‌, ఎస్వీఎన్‌ పట్నాయక్‌, సభ్యులు శేఖరమంత్రి శ్రీనివాస్‌, పట్నాయకుని రామచంద్రరావు, సోమశేఖర్‌, పొట్నూరు రవి, బలివాడ బాలభాస్కరరావు, వీణం శ్రీనివాస్‌, రఘుపాత్రుని భీమారావు తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర శిష్టకరణ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అక్కు మహంతిరాజా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement