ఈ నిధుల మాయాజాలంపై సీఎంవో, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదులు వెళ్లడంతో అంతర్గత విచారణ కమిటీ వేశారు. ఈ కమిటీపై ఆస్పత్రి వర్గాల్లోనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోపణలు ఎదుర్కొంటున్న శాఖలోని అధికారులే విచారణ చేస్తే నిజాలు వెలుగులోకి వస్తాయా? గతంలో ఇలాంటి అనేక కమిటీలు నివేదికలకే పరిమితమై, చర్యలు మాత్రం శూన్యంగా మిగిలిపోయాయన్న విమర్శలు ఉన్నాయి. కంటితుడుపు అంతర్గత కమిటీలను పక్కనపెట్టి జాయింట్ కలెక్టర్ లేదా విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ లేదా స్వతంత్ర ఉన్నతస్థాయి దర్యాప్తు సంస్థతో సమగ్ర విచారణ జరిపించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది. కాగా కమిటీ శనివారం కేజీహెచ్‌లో విచారణ చేపట్టింది. ఆవరణలోని ఆక్సిజన్ ప్లాంట్లను పరిశీలించింది.


