దస్తావేజు లేఖర్లకు న్యాయం చేయాలి | - | Sakshi
Sakshi News home page

దస్తావేజు లేఖర్లకు న్యాయం చేయాలి

Jul 26 2026 1:56 AM | Updated on Jul 26 2026 1:56 AM

అనకాపల్లి: ప్రభుత్వం రిజిస్ట్రేషన్‌ శాఖకు పీపీపీ పద్దతిలో ప్రేవేట్‌ వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు చర్యలు చేపట్టడం అన్యాయమని, బ్రిటిష్‌ కాలం నుంచి రిజిస్ట్రేషన్‌ శాఖలో విధులు నిర్వహిస్తున్న దస్తావేజు లేఖరులకు న్యాయం చేయాలని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్‌ అన్నారు. మండలంలో జాతీయ రహదారిలోని ఏఎంఎఎల్‌ కాలేజీ జంక్షన్‌ వద్ద దీక్షలు చేస్తున్న దస్తావేజు లేఖరులకు శనివారం ఆయన సంఘీ భావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉనారని పేర్కొన్నారు. జీవో నంబర్‌ 396ను ప్రభుత్వం తక్షణమే రద్దు చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి మలసాల కుమార్‌ రాజా, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు జాజుల రమేష్‌, ,80, 81వార్డు ఇన్‌ఛార్జ్‌లు కె.ఎం.నాయుడు, బొడ్డేడ శివ, జిల్లా పరిషత్‌ కో ఆప్షన్‌ సభ్యుడు పెతకంశెట్టి జోసఫ్‌, పార్టీ పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు వేగి త్రినాథ్‌, ఎంపీటీసీ శ్రీను, మాజీ సర్పంచ్‌ వరహాలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement