అనకాపల్లి: సాగునీటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని డీఎంఎఫ్‌టీ, ఇరిగేషన్ శాఖ, ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో రూ.10 కోట్ల వ్యయంతో డీసిల్టింగ్, కాలువల అభివృద్ధి పనులు చేపట్ట డం జరిగిందని కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మె ల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. మండలంలో శారదా నదిపై తుమ్మపాల వద్ద ఎల్లయ్య గ్రోయిన్ మరమ్మతు పనులు డీఎంఎఫ్‌టీ నిధులతో రూ.1.19 కోట్ల వ్యయంతో పూర్తి చేయడంతో, సుమారుగా 1500 ఎకరాలకు సాగునీటి కాలువ పూజను శనివారం ఆమె ప్రారంబించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యాక గోదావరి జలాలు అనకాపల్లి జిల్లాకు చేరి ఉత్తరాంధ్రలో లక్షల ఎకరాలకు సాగునీరు అందే అవకాశాలు మెరుగుపడతాయన్నారు. డేటా సెంటర్లు, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టుల ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని, మూతపడిన షుగర్ ఫ్యాక్టరీల స్థానంలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.


