అనకాపల్లి: బడుగు, బలహీన వర్గాల రోగుల కు ప్రభుత్వ ఆస్పత్రిల్లో వైద్యసేవలు కోసం సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఆస్పత్రికి వస్తారని, ఆటువంటి రోగులకు సకాలంలో వైద్యసేవలు అందించాలని కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు. స్థానిక ఆస్పత్రి ఆవరణలో శనివారం అభివృద్ధి కమిటీ సమావే శం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రోగులకు కావలసిన మౌలిక సదుపాయాలు, సకాలంలో వైద్యసేవలు అందించడం వల్ల వైద్యులతోపాటు, ఆస్పత్రి సిబ్బందికి మంచి గుర్తింపు ఉంటుందన్నారు. ఎక్కడైనా సమస్యలు ఉన్నట్టయితే తమ దృష్టికి తీసుకుని రావాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డీసీహెచ్‌ఎస్ ఎస్.శ్రీనివాసరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి, వైద్యులు, అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.


