ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు | - | Sakshi
Sakshi News home page

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు

Jul 25 2026 12:29 AM | Updated on Jul 25 2026 12:29 AM

బీచ్‌రోడ్డు(విశాఖ): రెల్వేప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ లలిత్‌ బోహ్రా ఆదేశించారు. విశాఖపట్నం–హజ్రత్‌ నిజాముద్దీన్‌ స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌ (12803) రైలులో శుక్రవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ప్రయాణికుల సౌకర్యాలు, భద్రత, పరిశుభ్రత, క్యాటరింగ్‌, కోచ్‌ నిర్వహణను సమీక్షించడానికి క్షుణ్ణంగా పరిశీలించారు. మెకానికల్‌, కమర్షియల్‌, ఎలక్ట్రికల్‌ విభాగాల అధికారులతో కలిసి ఆయన ప్రయాణికులతో మాట్లాడి అభిప్రాయాలు తెలుసుకున్నారు. వారి నుంచి స్వీకరించిన సూచనల ఆధారంగా డివిజన్‌ పరిధిలో ప్రయాణికుల సౌకర్యాలను మరింత మెరుగుపరచడానికి తక్షణమే చర్యలు చేపట్టాల ని అధికారులను డీఆర్‌ఎం ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement