మునగపాక(యలమంచిలి రూరల్): యలమంచిలి మున్సిపల్ కార్యాలయాన్ని గురువారం అకౌంటింగ్ స్టాండర్ట్స్ అడ్వైజరీ బోర్డు ప్రిన్సిపల్ డైరెక్టర్ డాక్టర్ జయరాజ నాయక్ బృందం సందర్శించింది. అకౌంటింగ్ విధానం, డిజిటల్ ఫైనాన్స్ నిర్వహణ, ఖాతాల నిర్వహణపై మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు నుంచి వివరాలు అడిగి తెలుసుకుంది. అకౌంటింగ్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని పలు సూచనలు చేసింది. పరిపాలనా పరమైన సేవలు మరింత విస్తృతం చేయాలని, ప్రతిఒక్కరికీ జవాబుదారుగా ఉండాలని ఆర్థిక లావాదేవీలు సక్రమంగా నిర్వహించాలని పేర్కొంది. కార్యక్రమంలో బోర్డు సభ్యులు పాల్గొన్నారు.


