హుండీ దొంగల అరెస్టు | - | Sakshi
Sakshi News home page

హుండీ దొంగల అరెస్టు

Jul 24 2026 1:21 AM | Updated on Jul 24 2026 1:21 AM

చోడవరం: దేవాలయాల్లో హుండీ చోరీలకు పాల్పడిన ముగ్గురు దొంగలను పట్టుకొని చోడవరం పోలీసులు గురువారం అరెస్టు చేశారు. ఈనెల 18వ తేదీన చోడవరం శివారు ద్వారకానగర్‌లో శ్రీ ఆంజనేయస్వామి, శ్రీరాముని ఆలయాల్లో హుండీలు చోరీ జరిగిన విషయం తెలిసిందే. సీసీ పుటేజీల ఆధారంగా దొంగలను గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. ఈ కేసులు చోడవరం వెంకయ్యగారిపేటకు చెందిన జెడిపల్లి భూపతి (23), తమిళనాడు రాష్ట్రం నమక్కల్‌ జిలాలలకు చెందిన వర కార్తిక్‌ (21), విజయనగరం జిల్లా పాతబొబ్బిలి గ్రామానికి చెందిన నెల్లి లోకేష్‌ (19)ను అరెస్టు చేసినట్టు చోడవరం సీఐ అప్పలరాజు చెప్పారు. ఈ నిందితులను చోడవరం ఎస్‌ఐలు నాగకార్తీక్‌, జోగారావు, సిబ్బంది సహకారంతో పట్టుకోవడం జరిగిందన్నారు. నిందితులను చోడవరం కోర్టుకు హాజరపర్చగా వీరికి రిమాండ్‌ విధించారని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement