చోరీ సొత్తు స్వాధీనం | - | Sakshi
Sakshi News home page

చోరీ సొత్తు స్వాధీనం

Jul 24 2026 1:21 AM | Updated on Jul 24 2026 1:21 AM

ఎస్‌.రాయవరం: వెంకటాపురం గ్రామంలో చోరీకి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నట్టు అడ్డురోడ్డు సీఐ ఎల్‌.రామకృష్ణ గురువారం తెలిపారు. ఈ నెల19 తేదీ రాత్రి వెంకటాపురంలో వాడపర్తి జోగయ్య ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు బద్దలుకొట్టి అరతులం బంగారం, రెండు జతల సిల్వర్‌ పట్టీలు, సుమారు రూ.6 వేలు నగదు అపహరించినట్టు బుధవారం పోలీసులకు ఫిర్యాదు అందింది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా అదే గ్రామానికి చెందిన కొప్పిశెట్టి వెంకటేష్‌ మద్యానికి బానిస అయ్యి చోరీకి పాల్పడినట్టు వెల్లడైందన్నారు. దీంతో నిందితుడి వద్ద చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని అతడిని రిమాండ్‌కు తరలించినట్టు సీఐ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement