పరారైన గంజాయి నిందితుల పట్టివేత | - | Sakshi
Sakshi News home page

పరారైన గంజాయి నిందితుల పట్టివేత

Jul 24 2026 1:21 AM | Updated on Jul 24 2026 1:21 AM

రావికమతం: గంజాయి అక్రమ రవాణా కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులని అదుపులోకి తీసుకోని వారిని గురువారం చోడవరం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు పంపినట్టు కొత్తకోట సీఐ కోటేశ్వరరావు, రావికమతం ఎస్‌ఐ రఘువర్మ తెలిపారు. వారు అందించిన వివరాలిలా ఉన్నాయి. ఈ నెల 15 తేదీన రావికమతం మండలం గుడివాడ కూడలి వద్ద రావికమతం ఎస్‌ఐ రఘువర్మ సిబ్బంది కలిసి తనిఖీలు చేస్తుండగా ఒడిశా నుంచి తమిళనాడుకు రెండు కార్లలో గంజాయి తరలిస్తున్న ముగ్గురు నిందితులను పట్టుకుని, 220 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. వారిలో మరో ఇద్దరు పారిపోయారు. ముగ్గురు నిందితులు, రెండు కార్లను, 220 కేజీల గంజాయిని ఈ నెల 15 తేదీన స్వాధీన పర్చుకొని వారిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసులో పరారీలో ఉన్న ఇద్దరు నిందితులు పల్నాడు జిల్లా ఇరుకుపాలేనికి చెందిన మోపర్తి యశ్వంత్‌, సత్తెనపల్లి నివాసి షేక్‌ కరీముల్లాలను గురువారం పోలీసులు అదుపులోకి తీసుకొని చోడవరం కోర్టులో హాజరు పరిచి రిమాండ్‌కు పంపినట్టు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement