రాష్ట్ర స్థాయి పారా క్రీడా పోటీల్లో పతకాల పంట | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి పారా క్రీడా పోటీల్లో పతకాల పంట

Jul 24 2026 1:21 AM | Updated on Jul 24 2026 1:21 AM

10 పతకాలు సాధించిన రావికమతం దివ్యాంగ విద్యార్థులు

రావికమతం: ఆంధ్రప్రదేశ్‌ సమగ్ర శిక్ష, పారా స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో హీల్‌ పారడైస్‌ స్కూల్‌ వేదికగా ఈ 20 నుంచి 23వ తేదీ వరకు నిర్వహించిన రాష్ట్ర స్థాయి పారా క్రీడా పోటీల్లో రావికమతం మండలానికి చెందిన నలుగురు దివ్యాంగ విద్యార్థులు 10 మెడల్స్‌ సాధించారు. ఈ పోటీల్లో మేడివాడ హైస్కూల్‌కు చెందిన జి. బాబూరావు టి –47 కేటగిరీ రిలే 400 ఈవెంట్‌లో గోల్డ్‌ మెడల్‌, లాంగ్‌ జంప్‌లో బ్రాంజ్‌ మొడల్‌ సాధించాడు. గర్నికం కేజీబీవీకి చెందిన ఎన్‌ హేమదర్గ ఎఫ్‌ 41 కేటగిరి డిస్క్‌ త్రోలో గోల్డ్‌ మెడల్‌, జూవెలిన్‌ త్రోలో సిల్వర్‌ మెడల్‌ సాధించింది. కొత్తకోట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు చెందిన కె రాము టి. 47 కేటగిరిలో రిలే 400 మీటర్ల రన్నింగ్‌లో గోల్డ్‌ మెడల్‌, షాట్‌ ఫుట్‌లో సిల్వర్‌ మెడల్‌ సాధించారు. చినపాచిల గ్రామానికి చెందిన సలాది మురళీ టి. 47 కేటగిరిలో లాంగ్‌ జంప్‌లో గోల్డ్‌ మెడల్‌, జువెలిన్‌ త్రోలో గోల్డ్‌ మెడల్‌, రిలే 400 ఈవెంట్‌లో గోల్డ్‌ మెడల్‌, 100 మీటర్ల పరుగు పందెంలో బ్రాంజ్‌ మెడల్‌ సాధించారు. వీరిని సమగ్ర శిక్ష ఏఎస్‌ పీడీ కె. రవీంద్రనాథ్‌ రెడ్డి, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ చైర్మన్‌ భరణి అభినందించి బహుమతులు అందజేశారు. శిక్షణ అందించిన ప్రత్యేక ఉపాధ్యాయుడు బొడ్డు మహాలక్ష్మీనాయుడు, జగన్నాథనాయుడులను ఎంఈవోలు లింగమూర్తి, బ్రహ్మాజీ అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement