నర్సీపట్నం: ఇటీవల కాకినాడలో నిర్వహించిన 13వ ర్యాంకింగ్ ఓపెన్ నేషనల్ స్పీడ్ స్కేటింగ్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో రోలర్ స్కేటింగ్ అసోసియేషన్‌కు చెందిన క్రీడాకారులు పతకాలు సాధించారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన విద్యార్ధులను క్యాంపు కార్యాలయంలో స్పీకర్ సిహెచ్.అయ్యన్నపాత్రుడు గురువారం అభినందించారు. జాతీయస్థాయి పోటీల్లో 7వ తరగతి విద్యార్ధి వి.సూర్యవంశి రింక్ 1000 మీటర్ల విభాగంలో స్వర్ణపతకం సాధించడంతో పాటు రింక్ 200 మీటర్లు, రోడ్ 500 మీటర్లు విభాగాల్లో రజత పతకాలు కై వసం చేసుకున్నాడు. నీట్ విద్యార్ధి జాన్సన్ పుట్టపల్లి రోడ్ 500 మీటర్లు, రింక్ 500ఫ్లస్ డీ విభాగాల్లో రజత పతకాలు, రింక్ 1000 మీటర్ల విభాగంలో కాంస్యపతకం సాధించాడు. 4వ తరగతి విద్యార్ధిని గొల్లు మాన్విత రింక్ 500ఫ్లస్ డీలో రజతం, రోడ్ 1ల్యాబ్, రింక్ 1000 మీటర్లలో క్యాంస్య పతకాలు సాధించింది. 5వ తరగతి విద్యార్ధిని వేచలపు జాహ్నవి రింక్ 800 మీటర్లలో రజతం, రోడ్ 500 మీటర్లు, రింక్‌ఫ్లప్‌డీ విభాగాల్లో కాంస్యపతకాలు సాధించగా, 6వ తరగతి విద్యార్ధిని కన్నూరి అనీష్ రింక్ 1000 మీటర్ల విభాగంలో రజత పతకాన్ని కై వసం చేసుకున్నాడు. పతకాలు సాధించేందుకు తర్ఫీదు ఇచ్చిన కోచ్ మణికంఠ కళ్యాణ్, విజేతలను స్పీకర్ అభినందించారు.


