నర్సీపట్నం: అమరావతి చాంపియన్‌షిప్ కప్ పోటీలకు బాక్సింగ్ క్రీడాకారులు స్థానిక ఎన్టీఆర్ స్టేడియంలో సాధన చేస్తున్నారు. అమరావతి చాంపియన్‌షిప్ కప్ –2026 నియోజకవర్గ స్థాయి ఎంపిక పోటీలు ఇక్కడ స్టేడియంలో ఈ నెల 26 నుంచి జరుగుతాయని శాప్ కోచ్ కె.అబ్బు గురువారం తెలిపారు. ఈ నెల 26న చెస్ క్రీడాకారులను ఎంపిక చేస్తామన్నారు. 30న పరవాడ సంస్కృతి గ్లోబల్ స్కూల్‌లో ఆర్చరీ, ఇదే రోజున నర్సీపట్నంలో బాక్సింగ్, యోగా, బ్యాడ్మింటన్, వేములపూడి హైస్కూలు, కాలేజీ గ్రౌండ్‌లో అథ్లెటిక్స్, కబడ్డీ క్రీడాకారులను ఎంపిక చేస్తామన్నారు. ఈ నెల 31న వేములపూడి హైస్కూలులో ఖోఖో, నక్కపల్లి జెడ్పీహెచ్ స్కూల్‌లో హాకీ, ఆగస్టు 1న ఎన్టీఆర్ స్టేడియంలో వాలీబాల్, ఆగస్టు 2న అనకాపల్లి ఎస్‌ఆర్డీలో వెయిట్ లిఫ్టింగ్, 3న అనకాపల్లి ఏఎంఏఎల్ కాలేజీలో బాస్కెట్ బాల్ ఎంపికలు నిర్వహిస్తామని తెలిపారు.


