విద్యార్థులపై లాఠీచార్జ్‌ అన్యాయం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థులపై లాఠీచార్జ్‌ అన్యాయం

Jul 23 2026 12:30 AM | Updated on Jul 23 2026 12:30 AM

చోడవరం: ఈ నెల 20న న్యూఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిర్వహించిన ’చలో పార్లమెంట్‌’ కార్యక్రమంలో శాంతియుతంగా నిరసనలో పాల్గొన్న విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్‌, టియర్‌ గ్యాస్‌ను ప్రయోగించడం అన్యాయమని పీడీఎస్‌వో రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.భాస్కర్‌ అన్నారు. ఢిల్లీలో జరిగిన ఘటనకు వ్యతిరేకంగా చోడవరంలో విద్యార్థులతో కలిసి పీడీఎస్‌వో నాయకులు నిరసన వ్యక్తం చేశారు. చోడవరం కళాశాల జంక్షన్‌ నుంచి బస్టాండ్‌ వరకూ ర్యాలీ నిర్వహించారు. నీట్‌ పరీక్షలో అవకతవకలు, అవినీతి, విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాల గురించి ప్రశ్నించిన విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడడాన్ని ఖండిస్తున్నట్లు భాస్కర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసాహితి జిల్లా నాయకులు గౌరీశంకర్‌, సీ్త్ర విముక్తి సంఘటన జిల్లా కన్వీనర్‌ లక్ష్మీకుమారి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement