ఎంఏఎఫ్‌ జాతీయ న్యాయ సలహాదారుగా వరప్రసాద్‌ | - | Sakshi
Sakshi News home page

ఎంఏఎఫ్‌ జాతీయ న్యాయ సలహాదారుగా వరప్రసాద్‌

Jul 23 2026 12:30 AM | Updated on Jul 23 2026 12:30 AM

అచ్యుతాపురం రూరల్‌: మానవ అధికార ఫారం (ఎమ్‌ఏఎఫ్‌) జాతీయ న్యాయ సలహాదారుగా అడ్వకేట్‌ కేవీవీ వరప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు ఆయనకు బుధవారం నియామక ఉత్తర్వులు, గుర్తింపు కార్డును అందజేసారు. బాధితులకు న్యాయపరమైన సహాయం అందించి, వినియోగదారుల హక్కుల పరిరక్షణకు కృషి చేస్తానని వరప్రసాద్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్‌ఏఎఫ్‌ రాష్ట్ర చైర్మన్‌ తంగప్పన్‌ కుమార్‌, అరకు మహిళా అధ్యక్షురాలు కె.సంతోషి, రాష్ట్ర కార్యాలయ ఇన్‌చార్జి డి.వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement