కె.కోటపాడు : ఈ నెల 18న విశాఖపట్నంలో రైల్వే అథ్లెటిక్స్ స్టేడియంలో నిర్వహించిన జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ మీట్‌లో ఎ.కోడూరు హైస్కూల్‌కు చెందిన విద్యార్థినులు పలు విభాగాల్లో ఉత్తమ ప్రతిభను చూపారు. అథ్లెటిక్స్‌లో భాగంగా పెంటాధలిన్ పోటీల్లో లెక్కల ఉమ గోల్డ్‌మెడల్‌ను సాధించింది. కొమ్మనాపల్లి కుసుమ ట్రయాథ్లాన్‌లో గోల్డ్‌మెడల్, యెల్లంకి జ్యోత్స్న ప్రియాంక ట్రయాథ్లన్‌లో సిల్వర్, మునస రోహిని ట్రయాథ్లన్‌లో సిల్వర్, కిల్లి ప్రమోదిని లాంగ్ జంప్, హైజంప్ పోటీల్లో సిల్వర్, కె.శ్యామ్ ట్రయాథ్లన్‌లో మూడో స్థానంలో నిలిచాడు. వీరికి నిర్వాహకులు పతకాలతో పాటు సర్టిఫికెట్‌లను ప్రదానం చేశారు.


