రావికమతం: ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష , పారా స్పోర్ట్స్’ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో హీల్ పారడైస్ స్కూల్ వేదికలో ఈ 20 నుంచి 23 వ తేదీ వరకు జరిగే రాష్ట్ర స్థాయి పారా క్రీడా పోటీలకు రావికమతం నుంచి నలుగురు దివ్వాంగ విద్యార్థులు ఎంపికై నట్టు దివ్యాంగులకు శిక్షణ అందిస్తున్న మేడివాడ ప్రత్యేక ఉపాధ్యాయులు బొడ్డు మహాలక్ష్మినాయుడు తెలిపారు. ఫిబ్రవరిలో అనకాపల్లి జిల్లాలో జిల్లా స్థాయి పారా క్రీడా పోటీలకు మండలం నుంచి 14 మంది దివ్యాంగ విద్యార్థులను పంపించగా వారిలో నలుగురు విద్యార్థులు జి.బాబూరావు (మేడివాడ హైస్కూల్), ఎన్.హేమదర్గ (కేజీబీవీ గర్నికం), కె.రాము (ప్రభుత్వ జూనియర్ కళాశాల కొత్తకోట) ఎస్. మురళి (చినపాచిల గ్రామం) జిల్లా స్థాయిలో ఉత్తమ ప్రతిభ కనబరించి రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీలకు ఎపికైనట్టు ప్రత్యేక ఉపాధ్యాయుడు బొడ్డు మహాలక్ష్మి నాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయా విద్యార్థులను, శిక్షణ అందించిన ఉపాధ్యాయులను పలువురు ఆభినందించారు.


