భూమిని సాగు చేసుకొని జీవనం సాగిస్తున్నాం. ఇంట్లో ఆర్థికపరమైన అవసరాలు వచ్చే సమయాల్లో ఈ భూమిని అమ్ముకోవడానికి వీలుకావడం లేదు. భూమి రికార్డులు తమ పేరును లేకపోవడంతో ఎవ్వరూ కొనుగోలు చేయడం లేదు. మా పేరున భూ హక్కులను కల్పించాలని కోరుతున్నా పరిష్కారం లభించడం లేదు.
–గండి సత్యనారాయణ, రైతు, పాచిలవానిపాలెం
సత్రం భూములుగా నమోదు చేశారు
గతంలో మూడు గ్రామాల్లో జిరాయితీ భూములకు రెవెన్యూ అధికారులు పట్టాదార్ పాస్ పుస్తకాలు మంజూరు చేశారు. ఈ భూములకు సంబంధించి 2015లో ఎండోమెంట్ అధికారులు రైతులకు ఎటువంటి నోటీస్‌లు ఇవ్వకుండా సత్రం భూములుగా నమోదు చేశారు. దీనిపై పలుమార్లు అధికారులను కలిసి ఫిర్యాదులు చేసినా నేటికీ పరిష్కారం లేదు. ప్రకృతి విపత్తులు సమయంలో ప్రభు త్వం నుంచి నష్టపరిహారం అందడం లేదు. పెట్టుబడులకు అప్పులు చేసి వడ్డీలు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. –కోమార వెంకటరమణ, రైతు, చౌడువాడ


