కశింకోట: కశింకోటలోని ఆర్‌ఈసీఎస్ పాలిటెక్నిక్ కళాశాలలో వినియోగదారుల కోటా కింద ప్రవేశానికి సోమవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్ విభాగాలలో అన్ని సీట్లు భర్తీ అయ్యాయి . సివిల్ ఇంజినీరింగ్ విభాగంలో కొన్ని సీట్లు మాత్రం భర్తీ కాలేదు. మొత్తం120 సీట్లకుగాను 102 సీట్లు భర్తీ చేసినట్టు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి. ఉమా శంకర్ తెలియ చేశారు. ఈ కౌన్సెలింగ్‌కు స్పెషల్ ఆఫీసర్‌గా అనకాపల్లి ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ ఐ.వి.ఎస్.ఎస్ శ్రీనివాసరావు, తనిఖీ అధికారులుగా లెక్చరర్లు సురేష్, రంగారాజ్ హాజరయ్యారు. కౌన్సెలింగ్‌లో అసోసియేట్ ప్రిన్సిపాల్ కె.శివ, విభాగాధిపతులు గణేష్, రమణ కుమార్, ఆఫీస్ సూపరింటెండెంట్ కె.శివరాం, సిబ్బంది పాల్గొన్నారు.


