కలెక్టర్, జాయింట్ కలెక్టర్‌ను నేరుగా కలిసి తమ సమస్య వివరించేందుకు వచ్చిన కొందరు దివ్యాంగులను కలెక్టరేట్ బయటే ఉంచి వారితో వచ్చిన సహాయకులను మాత్రమే లోపలకు పంపించి అర్జీ తీసుకుంటున్నారని, దివ్యాంగులమైన తమను కలెక్టర్‌ను కలిసేందుకు అనుమతించలేదని చెబుతున్నారు. ఆటోలో సుదూర ప్రాంతాల నుంచి వచ్చి కూడా కలెక్టరేట్ బయటే వీల్‌చైర్లలో ఉండిపోవాల్సి వస్తుందని, గంటల పాటు వేచి ఉన్న తరువాత సంబంధిత శాఖ అధికారులు వచ్చి సమస్య అడిగి తెలుసుకుని సరే అంటున్నారని, కలెక్టర్‌ను ప్రత్యక్షంగా కలిసే అవకాశం లేకపోవడంతో నిరాశకు గురవుతున్నారు.


