అనకాపల్లి: వ్యవసాయశాఖలో ఎంపీఈవోలుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని ఏపీ ఎంపీఈవోల యూనియన్ జిల్లా నాయకులు శ్రీను, సంతోష్, రాజా, ప్రశాంతిలు అన్నారు. స్థానిక గాంధీనగరం జిల్లా వ్యవసాయ కార్యాలయం వద్ద సోమవారం యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వ్యవసాయశాఖలో సుమారుగా 12 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్న పర్మనెంట్ చేయకపోవడం అన్యాయమని, సమాన పనికి సమాన వేతనం కింద రూ.35వేలు అమలు చేయాలని, శాశ్వత ఉద్యోగ భద్రత కల్పించాలని, నాన్ శాంక్షన్ పోస్టుల నుంచి శాంక్షన్ పోస్టులకు కన్వర్ట్ చేయాలని, హెల్త్ కార్డులు సదుపాయం కల్పించాలని, ప్రమాద భీమా కల్పించాలని, విధి నిర్వహణలో ప్రమాదానికి గురైన ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియా సదుపాయం కల్పించాలని, మహిళా ఉద్యోగులకు చైల్డ్ కేర్ లీవ్స్ మంజూరు చేయాలని తదితర డిమాండ్లతో ధర్నా చేపట్టారు. వివిధ రూపాల్లో ఈనెల 25వకు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.


