● కలెక్టర్‌కు హమాలీల వినతి
యలమంచిలిలో గల పౌరసరఫరాల గిడ్డంగి పరిమితిని తగ్గించేలా పలు డిపోలకు అందించాల్సిన సరుకులను మరో గిడ్డంగికి అప్పగించడంతో తమకు పనితగ్గి నెలవారీ వేతనం కూడా తగ్గిపోయిందని, గిడ్డంగి నుంచి తొలగించి డిపోలను పునరుద్ధరించి తమకు న్యాయం చేయాలంటూ హమాలీలు కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి హమాలీలుగా పనిచేస్తున్న తమకు జీవనాధారంగా ఉన్న గిడ్డంగిలో పని తగ్గిపోయి ఆర్థికంగా చితికిపోతున్నామంటూ ఆవేదన చెందారు. తమ సమస్యలపై కలెక్టర్‌కు వినతి పత్రం అందించారు.


