ఘన వ్యర్థాలప్రాసెసింగ్‌ ప్లాంట్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

ఘన వ్యర్థాలప్రాసెసింగ్‌ ప్లాంట్‌ ప్రారంభం

Jul 19 2026 12:56 AM | Updated on Jul 19 2026 12:56 AM

నర్సీపట్నం: పురపాలక సంఘంలో స్వచ్ఛ భారత్‌ మిషన్‌ 2.0 నిధుల కింద మంజూరైన రూ.305 లక్షల వ్యయంతో నిర్మించిన తడి, పొడి వ్యర్థాల ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ను కలెక్టర్‌ విజయకృష్ణన్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలంతా తడి,పొడి చెత్తను వేర్వేరుగా పారిశుధ్య కార్మికులకు అందించి, పట్టణ పరిశుభ్రతకు సహకరించాలన్నారు. డంపింగ్‌ యార్డు రిటైనింగ్‌ వాల్‌ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు సీహెచ్‌.పద్మావతి, సీహెచ్‌.రాజేష్‌, మున్సిపల్‌ ప్రత్యేకాధికారి, ఆర్డీవో వి.వి.రమణ, మున్సిపల్‌ కమిషనర్‌ జంపా సురేంద్ర, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుడబండి ఆదిలక్ష్మి, తహసీల్దార్‌ రామారావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement