నర్సీపట్నం: వేసవి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మున్సిపల్ అధికారులు పట్టణ ప్రధాన కూడలిలో చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. మండుతున్న వేసవి తాపానికి దాహార్తిని తీర్చుకునేందుకు పాదచారులు, వాహనదారులు చలివేంద్రాల వద్దకు పరుగులు తీస్తున్నారు. సిబ్బంది పర్యవేక్షణ కొరవడటంతో చలివేంద్రాల్లో నీళ్లు మధ్యాహ్నానికే నిండుకుంటున్నాయి. సోమవారం ఎల్‌ఐసీ భవనానికి ఎదురుగా మెయిన్ రోడ్డు పక్కన ఏర్పాటు చేసిన చలివేంద్రంలో నీళ్లు లేక ప్రజలు ఇబ్బంది పడ్డారు. చలివేంద్రంలో మూడు వాటర్ క్యాన్లు ఉన్నప్పటికీ చుక్కనీరు లేదు. దీంతో పాదచారులు వెనుతిరిగారు. కొంత మంది విద్యార్థుల షాన్‌షాపులో నిమ్మ సోడాలు కొనుకోని దాహార్తిని తీర్చుకున్నారు. చలివేంద్రాల నిర్వహణ సక్రమంగా ఉండేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


