కోటవురట్ల: పేకాట, కోడి పందాల స్ధావరాలపై పోలీసులు దాడులు నిర్వహించి ఆరుగురు వ్యక్తులను ఆరెస్టు చేశారు. ఎస్‌ఐ విజయ్‌కుమార్ తెలిపిన వివరాలివి..ముందస్తు సమాచారంతో బోడపాలెం శివార్లలో ఆదివారం రాత్రి దాడి జరిపి పేకాడుతున్న నలుగురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.25,200, కోడి పందాలు ఆడుతున్న ఇద్దరిని ఆరెస్టు చేసి వారి నుంచి రూ.2,200 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేశారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, పేకాట, కోడి పందాలు, డైస్, కాయిన్ గేమ్ వంటి జూదం నిర్వహించిన ఏపీ గేమింగ్ యాక్టు ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ విజయ్‌కుమార్ హెచ్చరించారు.


