వారం రోజుల్లో అర్జీలకు పరిష్కారం : ఎస్పీ సిన్హా | - | Sakshi
Sakshi News home page

వారం రోజుల్లో అర్జీలకు పరిష్కారం : ఎస్పీ సిన్హా

May 19 2026 12:40 AM | Updated on May 19 2026 12:40 AM

అనకాపల్లి: ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమానికి 65 అర్జీలు వచ్చాయి. ఎస్పీ తుహిన్‌ సిన్హా అర్జీలు స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ సమస్యలు, ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు, భార్యభర్తల మధ్య వేధింపులు, ఇతర ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన అర్జీలు వచ్చాయన్నారు. చట్టపరిధిలో ఉన్న సమస్యలను వారం రోజుల్లో పరిష్కారానికి చర్యలు చేపట్టడం జరుగుతుందని ఎస్పీ చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎల్‌.మోహనరావు, సీఐ సేనం రమేష్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement