ఏపీ లాసెట్‌లో 123వ ర్యాంకు | - | Sakshi
Sakshi News home page

ఏపీ లాసెట్‌లో 123వ ర్యాంకు

May 19 2026 12:40 AM | Updated on May 19 2026 12:40 AM

కోటవురట్ల: మట్టిలో మాణిక్యం ప్రతిభతో మెరిసింది. స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల సీఈసీ విద్యార్ధిని గొట్టివాడకు చెందిన వాకాడ అంజలి ఏపీ లాసెట్‌లో ప్రతిభ చాటింది. కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌లో అంజలి 123వ ర్యాంకు సాధించి మిగతా విద్యార్ధుకు స్పూర్తిధాయకంగా నిలిచింది. ఇటీవల వెల్లడైన ఇంటర్‌ ఫలితాల్లో కూడా అంజలి 902 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్‌ ఎఆర్‌టి సుజాత, లెక్చరర్లు, గ్రామస్తులు అంజలికి అభినందనలు తెలిపారు. మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. న్యాయ రంగంలో ఉన్నతంగా ఎదిగి పేదలకు అండగా ఉంటూ సమాజాభివృద్ధికి పాటుపడతానని అంజలి తెలిపింది.

Advertisement
 
Advertisement
Advertisement