అనకాపల్లి: ఎన్టీఆర్ ఆస్పత్రిలో జిల్లా ఆర్‌హెచ్‌ఐ మ్యాగ్నిటిక్ సంస్థకు చెందిన సీఎస్‌ఆర్ రూ.1.50కోట్ల నిధులతో నిర్మించిన నూతన భవనాలను ఎంపీ సీఎం.రమేష్, కలెక్టర్ విజయకృష్ణన్, ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ , ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్‌హెచ్‌ఐ సీఎస్‌ఆర్ నిధులతో ఆస్పత్రి ఆవరణలో రోగులకు కావలసిన మౌలిక సదుపాయలు నిమిత్తం నూతన భవనాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రూ.6లక్షల ఎంపీ నిధులతో మాత శిశువు వార్డు వద్ద పరిశుభ్రమైన ఆర్‌ఓ ప్లాంట్‌ను నిర్మించామన్నారు. ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ స్కానింగ్ సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సుమారుగా రూ.5 నుంచి 6 కోట్ల నిధులతో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఆర్‌హెచ్‌ఐ సంస్థ సీఈవో అభిషేక్ శర్మ, మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపరెడ్డి పరమేశ్వరరావు, డీఎంహెచ్‌వో శ్రీనివాసరావు, ఆస్పత్రి సూపరింటెండెంట్ రవి, డైట్ కళాశాల చైర్మన్ దాడి రత్నాకర్ పాల్గొన్నారు.


