2024లో 89.04 2025లో 88.44 2026లో 90.54 | - | Sakshi
Sakshi News home page

2024లో 89.04 2025లో 88.44 2026లో 90.54

May 1 2026 5:33 AM | Updated on May 1 2026 5:33 AM

సంవత్సరాల వారీగా ఉత్తీర్ణత శాతం

92.78 శాతం ఉత్తీర్ణతతో పైచేయి సాధించిన బాలికలు

టెన్త్‌ ఫలితాల్లో జిల్లాలో పెరిగిన ఉత్తీర్ణత, తగ్గిన స్థానం

90.54 శాతం ఉత్తీర్ణతతో 6వ స్థానంలో నిలిచిన జిల్లా

సాక్షి, అనకాపల్లి: పది ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. గురువారం వెలువడిన ఫలితాల్లో 90.54 శాతం ఉత్తీర్ణతతో జిల్లా రాష్ట్రంలో ఆరో స్థానంలో నిలిచింది. గత ఏడాదిలాగే ఫలితాల్లో మళ్లీ బాలికలే పైచేయి సాధించారు. జిల్లాలో బాలురు 88.33 శాతం ఉత్తీర్ణత సాధించగా, బాలికలు 92.78 శాతం ఉత్తీర్ణత సాధించారు. జిల్లా 2024లో 89.04 శాతం, 2025లో 88.44 శాతం, 2026లో 90.54 శాతం ఉత్తీర్ణత సాధించింది. గత ఏడాది ఐదవ స్థానంలో నిలువగా ఈ ఏడాది ఆరో స్థానంతో సరిపెట్టుకోవలసి వచ్చింది. జిల్లాలో మొత్తం 401(ప్రభుత్వ, ప్రైవేట్‌) పాఠశాలలకు గానూ 90.54 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. జిల్లా వ్యాప్తంగా పరీక్షలకు 20,577 మంది విద్యార్థులు హాజరుకాగా..18,592 మంది (90.54 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 10,369 మంది బాలురుకు గానూ 9,142 మంది, 10,208 మంది బాలికలకు గానూ 9,450 మంది ఉత్తీర్ణత సాధించా రు. బాలురు 85.88 శాతం, బాలికల 91.03 శాతం ఉత్తీర్ణులయ్యారు. 15,957 మంది ఫస్ట్‌ క్లాస్‌ సాధించగా, 2001 మందికి సెకండ్‌ క్లాస్‌, 634 మంది థర్డ్‌ క్లాస్‌లో ఉత్తీర్ణులయ్యారు. 1943 మంది ఫెయిల్‌ అయ్యారు. 500కు పైగా మార్కులు సాధించిన విద్యార్థులు 2,962 మంది ఉన్నారు.

జిల్లా టాపర్స్‌ వీరే

590కు పైగా మార్కులు సాధించి, టాపర్స్‌గా నలు గురు నిలిచారు. ఆడారి ప్రణీతి(యలమంచిలి జెడ్పీ బాలికల హైస్కూల్‌)–593, తనకాల ఉషా–592 మార్కులు (చౌడవాడ జెడ్పీ హైస్కూల్‌), పి.తారకేష్‌–591 మార్కులు(ఎం.జగన్నాథపురం జెడ్పీ హైస్కూల్‌), కనిగిరి హరిణి–591(పెదగుమ్ములూరు జెడ్పీ హైస్కూల్‌), చెక్కా జేసి–589(కింతలి జెడ్పీ హైస్కూల్‌), ఎడ్ల కొమ్మలి–589(చోడవరం గర్ల్స హైస్కూల్‌), యనమశెట్టి హేమ ప్రియ దర్శిని ఇందిర–589(వేములపూడి ఏపీ మోడల్‌ స్కూల్‌), పడాల నేహ–588(యలమంచిలి జెడ్పీ గర్ల్స్‌ హైస్కూల్‌), చేబ్రోలు ప్రేమ్‌చరణ్‌–588(ఎంజేపీ ఏపీబీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌), విల్లూరి తోరణి–588(జీవీఎంసీ గర్ల్స్‌ హైస్కూల్‌, గవరపాలెం, అనకాపల్లి), కాండ్రేగుల పూర్ణ సౌత్రిక–588(అచ్యుతాపురం కేజీబీవీ హైస్కూల్‌), పరవాడ అలేఖ్య–588(తేగాడ ఏపీ మోడల్‌ స్కూల్‌) సాధించారు. జిల్లాలో 32 ప్రభుత్వ పాఠశాలలు, 20 జెడ్పీ హైస్కూళ్లు, ఎంజేపీ బీసీ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌, ఏడు కేజీబీవీ పాఠశాలల్లో, జీటీడబ్యూఏ స్కూల్‌, టీడబ్ల్యూహెచ్‌ స్కూల్‌, నాతవరం ప్రభుత్వ హైస్కూల్‌ వంద శాతం ఉత్తీర్ణత సాధించాయి.

ప్రైవేట్‌ దీటుగా ప్రభుత్వ పాఠశాలలు

ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన పలువురు టాపర్లుగా నిలిచారు. ప్రభుత్వ పాఠశాలల్లో 88 శాతం ఉత్తీర్ణ నమోదు కాగా, ప్రైవేట్‌ స్కూళ్లలో 97శాతం ఉత్తీర్ణ సాధించాయి. ప్రభుత్వ పాఠశాల్లో 77శాతం, ఏపీఆర్‌ఈఐ సొసైటీ స్కూళ్లు 95 శాతం, కేజీబీవీలు 96శాతం, ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌ఈఐ సొసైటీ స్కూళ్లు 93 శాతం, గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు 95 శాతం, బీసీ వెల్ఫేర్‌ పాఠశాలలు 98 శాతం, ఎంపీపీ, జెడ్పీ పీపీ పాఠశాలలు 87 శాతం, మున్సిపల్‌ స్కూళ్లు 85 శాతం, ఏపీ మోడల్‌ స్కూళ్లు 98 శాతం, ప్రైవేట్‌ ఎయిడెడ్‌ 88శాతం, ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ 97 శాతం ఉత్తీర్ణత సాధించాయి.

ఆడారి ప్రణతి(593)యలమంచిలి జిల్లా పరిషత్‌ బాలికోన్నత పాఠశాల

పి.తారకేష్‌(591) ఎమ్‌.జె.పురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, అచ్యుతాపురం మండలం

తనకల ఉష(592) చౌడువాడ హైస్కూల్‌, కె.కోటపాడు మండలం

కనిగిరి హరిణి(591)

ఎస్‌.రాయవరం మండలం పెదగుమ్ములూరు

ఫలితాల శాతంలో మాడుగుల మండలం టాప్‌..

జిల్లాలో 24 మండలాల వారీగా ఫలితాల శాతం పరిశీలిస్తే..మాడుగుల మండలంలో అత్యధికంగా 97.3 శాతం ఉత్తీర్ణత రాగా..మాకవరపాలెం మండలాల ఉత్తీర్ణత శాతం 82.27 శాతంతో అత్యల్పంగా నమోదైంది.

Advertisement
 
Advertisement
Advertisement