ఘనంగా మోదకొండమ్మ ఉత్సవ రాట | - | Sakshi
Sakshi News home page

ఘనంగా మోదకొండమ్మ ఉత్సవ రాట

May 1 2026 5:33 AM | Updated on May 1 2026 5:33 AM

ఉత్సవ రాట వేస్తున్న చైర్మన్‌ అప్పలరాజు, భక్తులు

మాడుగుల: ఉత్తరాంధ్ర ఇలవేల్పు మాడుగుల మోదకొండమ్మ పండగ సందర్భంగా సతకంపట్టు వద్ద గురువారం ఆలయ కమిటీ చైర్మన్‌ పుప్పాల అప్పలరాజు, కమిటీ సభ్యులు దంగేటి సూర్యారావు, శ్రీనాథు శ్రీనివాసరావు, భీమరశెట్టి పైడియ్యనాయుడుల ఆధ్వర్యంలో ఉత్సవ రాట వేశారు. జూన్‌ 2వ తేదీన జరగనున్న అమ్మవారి పండగకు ఏర్పాట్లు చేయనున్నారు. ఉత్సవ రాట వేసి పనులు ప్రారంభించిన రోజే పట్టణంలో చిరుజల్లులు కురిసి వాతావరణం చల్లబడిందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నౌపడ వరకే గుణుపూర్‌ పాసింజర్‌

తాటిచెట్లపాలెం(విశాఖ): వాల్తేర్‌ డివిజన్‌, నౌపడ–పర్లాకిమిడి సెక్షన్‌ మధ్య జరుగుతున్న ఆధునికీకరణ పనుల నిమిత్తం మే 3వ తేదీన బయల్దేరే విశాఖపట్నం–గుణుపూర్‌–విశాఖపట్నం (58506/58507) పాసింజర్‌ నౌపడ వరకే రాకపోకలు సాగిస్తుందని వాల్తేర్‌ డివిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ పవన్‌కుమార్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement