కశింకోట: ఈ చిత్రాన్ని చూడండి.. ఒక జంటనే కట్‌చేసి వేరే ఫోజ్‌తో మళ్లీ పక్కన అతికించినట్టు ఉందనుకుంటున్నారా అయితే పొరబడినట్టే. ఎందు కంటే ఈ చిత్రంలో ఉన్నది ఒక జంట కాదు రెండు జంటలు. కవలలైన ఇద్దరు యువకులు, కవలలైన యు వతులను ఒకే మూహూర్తానికి వివాహమాడారు. ఈ అరుదైన వివాహమహోత్సవానికి కశింకోటలోని కనకమహాలక్ష్మి వీధి వేదికగా మారింది. స్థానిక మేదర వీధి కోటదిబ్బ ప్రాంతానికి చెందిన పెంటకోట అప్పారావు, లక్ష్మి దంపతుల కుమారులు రాము, లక్ష్మణ్ కలవలు. వీరికి తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం శ్రీరంగపట్నం గ్రామానికి చెందిన రమ్య,లావణ్య అనే కవలలతో ఒకేరోజు ఒకే ముహూర్తాన వివాహం జరిపారు. రాము–రయ్య, లక్ష్మణ్–లావణ్య దంపతులుగా మారారు.


