బుచ్చెయ్యపేట : బుచ్చెయ్యపేట మండలంలో వర్షం దంచి కొట్టింది. ముత్యాల తలంబ్రాలు పోసినట్టుగా వడగళ్ల వాన కురిసింది. బుచ్చెయ్యపేట, దిబ్బిడి, నేతవానిపాలెం, కందిపూడి, కేపీ ఆగ్రహారం, ఐయితంపూడి, కొమళ్లపూడి తదితర గ్రామాల్లో గుప్పెడంత వడగళ్లు పడడం ఆశ్చర్యం గొలిపింది. ఇంటి ముందు ఉన్న గోళాలు, కుండీల్లో వడగళ్లు పోగులుగా చేరాయి. రోడ్డుపై పెద్దపెద్ద వడగళ్లు పడడంతో పలువురు ఇళ్లల్లోకి పరుగులు తీశారు. వడగళ్ల వానతో మామిడి కాయలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది.


